ఇండియాలోనే టాప్‌.. ‘సేవ్ ది టైగర్స్‌2’ రికార్డు

-

టాలీవుడ్ లో ఇటీవల వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలా మంది హీరోహీరోయిన్లు, సీనియర్ నటులు డిజిటల్ మీడియాలో ఎంట్రీ ఇస్తున్నారు. మరోవైపు చాలా మంది నటులు ఓవైపు వెండి తెరపై సందడి చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా ఓటీటీలో కనువిందు చేస్తున్నారు.  టాలీవుడ్ నటులు ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్‌ గోమఠం కీలక పాత్రల్లో తెరకెక్కిన కామెడీ వెబ్‌ సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’ ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.

పార్ట్-1 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పార్ట్-2 తీశారు మేకర్స్. ఇక సెకండ్ పార్ట్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ‘సేవ్‌ ది టైగర్స్‌ 2’ పేరుతో వచ్చిన ఆ సిరీస్‌ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారమవుతూ తాజాగా రికార్డు సృష్టించింది. ఈ తెలుగు వెబ్‌ సిరీస్ దేశంలోని టాప్‌ 3లో నిలిచింది. ఓటీటీలోనే దేశవ్యాప్తంగా అత్యధిక మంది చూసిన సిరీస్‌ల్లో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో టీమ్‌ ఆనందం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version