ఓటీటీలోకి వచ్చేసిన ‘సేవ్ ద టైగర్స్ 2’..ఎందులో స్ట్రీమింగ్ అంటే

-

Save The Tigers 2 Story: ‘సేవ్‌ ది టైగర్స్‌’ వెబ్‌ సిరీస్‌ మళ్లీ వచ్చేసింది. ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్‌ గోమఠం కీలక పాత్రల్లో తెరకెక్కిన కామెడీ వెబ్‌ సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’. గతేడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్‌ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ సిరీస్లోని కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోవైపు నెటివిటీకి దగ్గరగా ఉన్న క్యారెక్టర్లతో విపరీతంగా కనెక్ట్ అయ్యారు.

Save The Tigers 2 Story

ఈ సిరీస్ కు వచ్చిన క్రేజ్ చూసి మేకర్స్ సీక్వెల్ తీయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా సీజన్‌-2 వచ్చేసింది. తాజాగా ఈసారి సీజన్‌-2 లో సీరత్‌ కపూర్‌ కీలక పాత్రలో నటించింది. మహి వి. రాఘవ, ప్రదీప్‌ అద్వైతం రూపొందించిన ‘సేవ్‌ ది టైగర్స్‌ 2’కు అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ‘సేవ్‌ ది టైగర్స్‌’ సీజన్‌-2 హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

సీజన్‌ 2 కథ విషయానికి వస్తే… హీరోయిన్ హంసలేఖ (సీరత్ కపూర్) ఎక్కడ? అని పోలీస్ స్టేషన్‌లో విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను ప్రశ్నిస్తారు. ఆమె మిస్సింగ్ కేసులో ముగ్గురికీ గట్టిగా లాఠీ ట్రీట్మెంట్ ఇస్తారు. తమకు తెలియదని ఎంత చెప్పినా పోలీసులు వినరు. వాళ్లకు స్టార్ హోటల్ నుంచి హంసలేఖను తీసుకువెళ్లిన వీడియో చూపిస్తారు.

ఆ ముగ్గురూ కలిసి ఆమెను చంపేశారేమో అని న్యూస్ ఛానళ్లు అనుమానం వ్యక్తం చేస్తాయి. అదంతా అబద్ధమని, తాము కలిసి పార్టీ చేసుకున్నామని హంసలేఖ డైరెక్టుగా వచ్చి చెప్పడంతో వదిలేస్తారు పోలీసులు. అసలు ఈ ట్విస్ట్‌కు కారణాలు తెలియాలంటే వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే. ఇక Save The Tigers 2 కంటే సీజన్‌ 2 బాగుందని చెబుతున్నారు ప్రేక్షకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version