ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సేవ్‌ ది టైగర్స్‌-2’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్‌ గోమఠం కీలక పాత్రల్లో తెరకెక్కిన కామెడీ వెబ్‌ సిరీస్‌ ‘సేవ్‌ ది టైగర్స్‌’ . గతేడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్‌ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ సిరీస్లోని కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోవైపు నెటివిటీకి దగ్గరగా ఉన్న క్యారెక్టర్లతో విపరీతంగా కనెక్ట్ అయ్యారు.

ఈ సిరీస్ కు వచ్చిన క్రేజ్ చూసి మేకర్స్ సీక్వెల్ తీయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా సీజన్‌-2 రాబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. తొలి సీజన్‌ను మించి నవ్వులు పంచడానికి సిద్ధమైనట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈసారి సీరత్‌ కపూర్‌ కీలక పాత్రలో నటించింది. మహి వి. రాఘవ, ప్రదీప్‌ అద్వైతం రూపొందించిన ‘సేవ్‌ ది టైగర్స్‌ 2’కు అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 15వ తేదీ నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news