గతంలో దేశ వ్యాప్తంగా షీనా బోరా హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ హత్య కేసుపై నెట్‌ఫ్లిక్స్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్ ట్రూత్’ అనే డాక్యుమెంటరీ రూపొందించింది. కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ సిరీస్ తాజాగా నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో షానా లెవీ, ఉరాజ్ బహల్ కీలక పాత్రలు పోషించారు.
మొదట ఈ సిరీస్‌ను ఫిబ్రవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓటీటీలో విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సీబీఐ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. విచారించిన డివిజన్ బెంచ్ దర్యాప్తు సంస్థతోపాటు న్యాయస్థానం వీక్షించేందుకు ముందస్తుగా ప్రదర్శించాలని సదరు ఓటీటీ సంస్థను ఆదేశించింది. తాజాగా దీనిపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మార్చి 1వ తేదీ నుంచి నెట్ఫ్లిక్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.