ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయిందిగా ..ఇక కెరీర్ పీక్స్ లోనే ..!

-

పెళ్ళైన కొత్తలో సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకుంది ప్రియమణి. ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. చెప్పాలంటే ప్రియమణి సినిమా కెరీర్ చాలా బ్యాలెన్స్ గా సాగింది. ఇక పరుత్తి వీరన్ లో నటనకి ప్రియమణి ని నేషనల్ అవార్డు వరించింది. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాలో నటించిన ప్రియమణి నితిన్, గోపిచంద్ లాంటి స్టార్ హీరోలతో నటించి సక్సస్ లను సొంతం చేసుకుంది.

 

అయితే పెళ్ళి చేసుకున్న ప్రియమణి కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంది. మళ్ళి ఇప్పుడు తెలుగులో వరసగా సినిమాలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. చెప్పాలంటే ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయింది. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు అద్భుతమైన సినిమాలని చెప్పాలి. అందులోను ఆ రెండు సినిమాలు దగ్గుబాటి హీరోలవి కావడం రెండు సినిమాలకి సురేష్ బాబు నిర్మాత కావడం విశేషం.

తమిళ అసురన్ రీమేక్ నారప్ప లో వెంకటేష్ సరసన నటిస్తున్న ప్రియమణి రానా సరసన కూడా నటిస్తుంది. సాయి పల్లవి మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విరాటపర్వం అన్న టైటిల్ తో తెరకెక్కుతుంది. వేణు ఉడుగుల ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశర్య క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. 1992 ల నాటి పీరియడ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈరోజు ప్రియామణి బర్త్ డే సందర్భంగా విరాటపర్వం నుండి తన లుక్ ని రిలిజ్ చేశారు చిత్ర బృందం. ఈ లుక్ కి ప్రేషకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version