అరవింద ఇంటర్వెల్ సీన్.. కేకలే అట

-

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబోలో వస్తున్న అరవింద సమేత దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీగా వస్తున్న అరవింద సమేత సినిమా ట్రైలర్ అదిరిపోయిందని అభిమానుల నుండి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుందని అంటున్నారు.

మొదటి భాగం అంతా సరదాగా హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ నడుస్తుందట.. ఇంటర్వెల్ లో హీరో సీమకు వెళ్లడం అక్కడ విజృంభించడం జరుగుతుందట. ఇక సెకండ్ హాఫ్ మొత్తం సీరియస్ గా నడుస్తుందని అంటున్నారు. సినిమా ఎమోషనల్ గా బాగా వచ్చిందని టాక్. సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువున్నట్టు అనిపిస్తున్నా త్రివిక్రం మాటల గారడి కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్రయూనిట్ నుండి వస్తున్న సమాచారం.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version