Naa Saami Ranga : నా సామిరంగ నుంచి ‘సీసా మూత ఇప్పు’ లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

-

Naa Saami Ranga : విజయ్‌ బన్నీ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నా సామిరంగ’.పూర్తిస్థాయి మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘నా సామిరంగ’ వస్తోంది.ఆషికా రంగనాథ్‌ కథానాయికగా న‌టిస్తుంది .విజయ్‌ బన్నీ ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అల్ల‌రి న‌రేష్, రాజ్ త‌రుణ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న‌ ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

Seesa Mootha Ippu

అయితే, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ తో పాటు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఇలా ఉంటే…. తాజాగా ఈ సినిమా నుంచి పార్టీ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. సీసా మూత ఇప్పు అంటూ సాగే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే ప్రేమ బండి చలో అంటే… రైస్ మిల్లు నెల జీతం రయి రయి మని పెరిగింది అంటే ఫేవరెట్ హీరో బొమ్మ హౌస్ ఫుల్ పడిందంటే…. ఇండియా కప్పు కొట్టుకొస్తే ఇల్లాలే రాజీకొస్తే…. పక్కింటోడికి లాస్ వస్తే… వారిని ఓదార్చే ఛాన్స్ వస్తే…. ఏం చేయాలి సెప్పు…. సీసా మూత ఇప్పు…. ఏం చేయాలి సెప్పు…. సీసా మూత ఇప్పు అంటూ ఫుల్ ఎనర్జిటిక్ గా ఈ పాట సాగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version