ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, డిల్లీ సీఎం అర్వింద్ కేజీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి జనవరి 18న విచారణకు హాజరు కావాలని ఈడి ఆదేశించినది. కేజీవాల్కు ఇప్పటికే 3 సార్లు నోటీసులు జారీ చేసినా హాజరుకాలేదు. దీంతో తమ ఎదుట హాజరు కావాలని ఈడి నాలుగోసారి ఆదేశాలు కేజ్రీవాల్ కి జారీ చేసింది. జనవరి 3న మూడోసారి సమన్లు జారీ చేయగా.. వీటిని అక్రమమని కేజీవాల్ అన్నారు. ‘ఆ నోటీసులు చట్టవిరుద్ధమైనవి. రాజకీయ ప్రేరేపితమైనవి. బీజేపీ సూచన మేరకే సమన్లు పంపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నన్ను దూరం చేసేందుకు వీటిని జారీ చేశారు అని ఆయన అన్నారు. తక్షణమే సమన్లను ఉపసంహరించుకోవాలి’ అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
ఈడీ నోటీసులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు కావున కేజ్రీవాల్ విచారణకు హాజరైతే ఈడి కచ్చితంగా అరెస్ట్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది.