సీనియర్ ఎన్టీఆర్ కు తీరని కోరిక అదేనట..!!

-

తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ అటు రాజకీయాలలో ఇటు సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా తనను ఆదరించిన ప్రేక్షకులకు మంచి చేయాలని ఆలోచనతోనే రాజకీయాలలొకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. వెండితెరపై ఎన్నో పాత్రలు వేసి ప్రేక్షకులను అలరించిన ఎన్టీ రామారావు గారు జీవితంలో మాత్రం ఒక తీరని కోరిక మిగిలిపోయిందట. వాటి గురించి తెలుసుకుందాం.

సీనియర్ ఎన్టీఆర్ కు తీరని కోరిక ఏమిటంటే అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాలని చాలా ఆశ ఉండేదట. ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా చివరికి అది తీరని కోరికగానే మిగిలి పోయిందట. ఎన్టీఆర్ కు ఈ కోరిక ఎలా పుట్టిందని విషయానికి వస్తే.. 1954లో ఎన్టీఆర్ అగ్గి రాముడు సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు కథ కోసం రచయిత ఆత్రేయ ఒక పాటని రాశారట. అయితే ఈ పాట ఎన్టీఆర్ పై తీవ్ర ప్రభావం చూపించిందని అల్లూరి జీవితాన్ని సినిమాగా తీయాలని కోరిక ఎన్టీఆర్లో కలిగిందట.

అప్పట్లో అల్లూరి సీతారామరాజు నాటకాలకు మంచి పేరు సంపాదించిన పదాల రామారావు తో కలిసి కథ బాధ్యతను ఈయనకు అప్పజెప్పారట ఎన్టీ రామారావు. అలా కథ రెడీ అయిన తర్వాత ఎన్టీఆర్ మొదటిసారి ఒక స్టిల్ ని అల్లూరి సీతారామరాజు గెటప్ లో చెక్ చేసి 1957 జనవరిలో పాట రికార్డుతో సినిమాని మొదలు పెట్టారట. అయితే ఎన్నోసార్లు అల్లూరి సీతారామరాజు సినిమాని తెరకెక్కించ బోతున్నామంటూ ప్రకటించగా ఆ సినిమా కొన్ని కారణాల చేత ఆగిపోతూ వస్తూనే ఉందటు ప్రకటించినప్పుడల్లా ఆగిపోతూ వస్తోందట.. కానీ చివరికి అల్లూరి సీతారామరాజు చిత్రం సూపర్ స్టార్ కృష్ణ 1974లో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా కృష్ణ గారి 100వ చిత్రంగా పెరకెక్కించడం జరిగింది. ఎన్టీఆర్ కు ఆ పాత్ర పైన మమకారంతో సర్దార్ పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్ తదితర చిత్రాలలో అల్లూరి సీతారామరాజు గెటప్పులో కాసేపు కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news