త్వరలో కీర్తి సురేష్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన ఆమె తండ్రి.!

-

మహానటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె ఇప్పుడు నిత్యం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందులో డి గ్లామరస్ పాత్ర పోషించి మరింతగా ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తరచూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై హెడ్లైన్స్ లో నిలుస్తోంది. గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ ఒక అబ్బాయి తో డేటింగ్ లో ఉందని.. త్వరలోనే ఆ వ్యక్తిని వివాహం కూడా చేసుకోబోతుందని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

 

ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈమె రహస్యంగా రెస్టారెంట్లలో ఆ వ్యక్తిని కలుసుకుంటుందని .. అందుకు తగ్గట్టుగానే ఆ అబ్బాయితో కలిసి దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేయడంతో వార్తలకు మరింత బలం చేకూరగా .. అందులోను ఇద్దరు ఓకే కలర్ డ్రెస్ ధరించడం మరింతగా అనుమానాలకు దారితీస్తోంది. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ ఇప్పుడు కీర్తి సురేష్ తండ్రి కూడా రంగంలోకి దిగారు.

 

తన కూతురు ఒక అబ్బాయి తో డేటింగ్ లో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.. అవన్నీ ఫేక్ .. నాకు ఆ అబ్బాయి తెలుసు.. అతడు మా సన్నిహిత కుటుంబ స్నేహితుడు ఫర్హాన్ పుట్టినరోజున కీర్తి కొన్ని ఫోటోలను పంచుకుంది. వాటిని ఒక తమిళ మ్యాగజైన్ సేకరించి ఇలా పెళ్లి ఫిక్స్ అయిందంటూ వార్తలు సృష్టించారు .ఒకవేళ కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్ చేస్తే మొదటగా మీతోనే చెబుతాము అంటూ ఆయన తెలియజేశారు . ఇకపోతే తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి అని దానివల్ల తాము ఇబ్బంది పడతామని కూడా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news