రూ.5 వేలు పెడితే.. రూ. 25 లక్షల ఆదాయం.. పూర్తి వివరాలు ఇవే…!

-

కేంద్ర ప్రభుత్వం చాలా స్కీములని తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ స్కీముల్లో చాలా రకాల ప్రయోజనాలని పొందొచ్చు. కేంద్రం అందించే స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి కూడా ఒకటి. సుకన్య సమృద్ధి స్కీమ్ తో సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఇంట్లో ఆడపిల్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని కేంద్రం తెచ్చింది. ఆడ పిల్లల పెళ్లికి లేదా వారి పై చదువుకు ఉపయోగపడేలా ఈ స్కీమ్ ఉంటుంది. కనుక భవిష్యత్తు లో ఈ ఖర్చులు ఎదురైనప్పుడు ఏ ఇబ్బంది ఉండదు.

ఈ స్కీము డబ్బులు ఉపయోగ పడతాయి. రిస్క్‌ తక్కువ ఉంటుంది. నెలవారీగా కొంత మొత్తంలోనే పెట్టుబడి పెట్టే అవకాశం వుంది. కనుక చాలా మంది ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అకౌంట్ హోల్డర్‌కు 18 ఏళ్ల వయసు వచ్చే సరికి మెచ్యూరిటీ అమౌంట్‌లో 50 శాతం తీసుకోవచ్చు. 21 ఏళ్లు వచ్చే సరికి మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఈ స్కీము కింద ఇప్పుడు వడ్డీ 8 శాతం గా వుంది. ప్రతీ త్రైమాసికానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. గరిష్టంగా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకు ఈ స్కీము వర్తిస్తుంది.

సుకన్య సమృద్ధిలో చేరితే 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టచ్చు. ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంకులో రూ. 205తో అకౌంట్‌ను ఓపెన్‌ చేయొచ్చు. నెలకు రూ. 5 వేలు పెట్టుబడి పెడితే చేతికి రూ. 25 లక్షల ఆదాయం అందుతుంది. ఏటా మీరు రూ. 60 వేలు కడితే మొత్తం 15 ఏళ్ల లెక్కన మీరు రూ. 9 లక్షలు పే చెయ్యాలి. ఏటా 15 ఏళ్ల వరకు కడితే 21 ఏళ్లు వచ్చే సరికి చేతికి మొత్తం రూ. 25 లక్షలు అందుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news