స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సరికొత్త రికార్డ్ ను అందించిన బుట్ట బొమ్మ..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా హిట్ కు తమన్ పాటలు ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చిత్రం విడుదలకు ముందే ఈ సినిమాలో పాటలు సెన్సేషన్ సృష్టించాయి. ఒక్క పాట అని కాదు ఒక్క చోట అని కాదు…

ఈ చిత్రం లో పాటలు విడుదల అయ్యాక ఎక్కడ చూసినా ఈవే. ఈ పాటలే ఇప్పుడు అల్లు అర్జున్ కు సరికొత్త రికార్డ్ ను అందించాయి. అంతే కాకుండా ఈ ప్రత్యేకమైన రికార్డ్ సొంతం చేసుకున్న మొదటి హీరో కూడా బన్నీ నే. నెల రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ‘బుట్ట బొమ్మ’ ఫుల్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేసారు. ఈ పాట ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. నెల రోజుల్లోనే ‘బుట్ట బొమ్మ సాంగ్ 98 మిలియన్ వ్యూస్,

దక్కించుకుని త్వరలో 100 మిలియన్ వ్యూస్ కి చేరబోతుంది. అతి తక్కువ సమయంలో బుట్ట బొమ్మ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ అంటే రికార్డు అనే చెప్పాలి. అంతకు ముందు బుట్ట బొమ్మ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో 51 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మొత్తంగా చూస్తే 150 మిలియన్ వ్యూస్‌ దక్కించుకుంది బుట్ట బొమ్మ సాంగ్. అంతకు ముందు కూడా ఈ సినిమాలోని రాములో రాములా,

లిరికల్ వీడియో కు 240 మిలియన్ వ్యూస్, సామజవరగమన లిరికల్ వీడియో కు 178మిలియన్ వ్యూస్‌ వచ్చాయి. తెలుగులో ఒక హీరో నటించిన ఒక సినిమాలోని పాటలకు ఇన్ని వ్యూస్ రావడం అనేది రికార్డు. ఏదేమైనప్పటికీ తెలుగులో ఒక హీరో నటించిన ఇన్ని పాటలు, లిరికల్, ఫుల్ వీడియో సాంగ్స్ కలిపి ఇన్ని వ్యూస్ రావడంతో అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news