అనుష్క సినీ కెరీర్ మొత్తాన్ని తలకిందులు చేసిన సినిమా అదే..!

-

సూపర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది అనుష్క శెట్టి. దాదాపు 9 నెలలు సెట్లో ఖాళీగా కూర్చున్న అనుష్క ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అవుతుందని తనని పరిచయం చేసిన డైరెక్టర్ పూరి జగన్నాధ్ గాని, అలాగే హీరో అక్కినేని నాగార్జున గాని ఊహించలేదు. నాగార్జునతోనే ఎక్కువ సినిమాలు చేసిన అనుష్క, టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌కి సంబంధిన విషయలలో మాత్రం ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే ఎవరెన్ని మాట్లాడినా కూడా ఫైర్ అవకుండా చిన్న చిరునవ్వుతోనే సమాధానం చెబుతుంది.

 

ఇక కెరీర్ ప్రారంభం లో గ్లామర్ పాత్రల్లో నటించిన అనుష్క ప్రభాస్ హీరోగా వచ్చిన బిల్లా లో బికిని ధరించి కూడా షాకిచ్చింది. రొమాంటిక్ సీన్స్, గ్లామర్ డోస్ తో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. అయితే అనుష్క ఎప్పుడైతే శత చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాలో నటించిందో అప్పటి నుంచి తన రేంజ్ మొత్తం మారిపోయింది. ఈ రేంజ్ ఇండస్ట్రీలో ఏ ఒక్కరు ఊహించలేదు. అంతేకాదు అనుష్క లాంటి గ్లామర్ పాత్రలు పోషిస్తున్న ఏ హీరోయిన్ అరుంధతి లాంటి సినిమా ఒప్పుకునే సాహసం చేయరు. అదే అనుష్క కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. ఎంతగా అంటే అరుంధతికి ముందు అనుష్క అరుంధతి తర్వాత అనుష్క అన్నంతగా క్రేజ్ ని దక్కించుకుంది.

ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ లో లేడి ఓరియొంటెడ్ చిత్రాలు పెరిగాయి. వాటిలో ఎక్కువగా అనుష్క కోసం మాత్రమే మేకర్స్ కథలు తయారు చేశారు. అలాంటి సినిమానే ‘‘సైజ్ జీరో’’. ఈ సినిమాకోసం అనుష్క తన సినీ కెరీర్ నే పణంగా పెట్టిందని చెప్పాల్సిందే. ఈ సినిమాకోసం లావెక్కి చేసిన ప్రయోగం తో అనుష్క సినిమా కెరీర్ చిక్కుల్లో పడింది. ఓవర్ వేయిట్ వల్ల తన కోసం అనుకున్న కథ లని వేరే హీరోయిన్స్ కి షిఫ్ట్ చేశారు. ఒక సందర్భంలో బాహుబలి కన్‌క్లూజన్ కి రాజమౌళి కూడా ఇలా ఉంటే కుదరదు బరువు తగ్గాలని గట్టిగా చెప్పారు. కేవలం ఒక్క సైజ్ జీరో సినిమా అనుష్క కెరీర్ లో చాలా సినిమాలు మిస్సవడానికి కారణం అంటే ఆ సినిమా ప్రభావం తన మీద ఎంతగా పడిందో ఊహించవచ్చు. ఇక ప్రస్తుతం నిశబ్ధం అన్న సినిమాలో నటించిది. ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news