Avika Gor : చిన్నారి పెళ్లికూతురు లవ్ ఎఫ్ఫైర్ బయటపెట్టిన సీరియ‌ల్ న‌టుడు

-

“చిన్నారి పెళ్లికూతురు” సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అవికా గోర్ (Avika Gor). ఆ సీరియల్ తో బాగా పాపులర్ అయిన అవికా గోర్… “ఉయ్యాల జంపాల” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది. ఇటీవల “రాజుగారి గదిలో-3” లో హీరోయిన్ గా నటించి పర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వస్తున్న “థాంక్యూ” మూవీలో కూడా చాన్స్ కొట్టేసింది ఈ హీరోయిన్. ఇది ఇలా ఉండగా… చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ తర్వాత అవికాగోర్, సీరియల్ యాక్టర్ మ‌నీశ్‌రాయ్ సింగ‌న్ ప్రధాన పాత్రల్లో “ససురాల్ సిమర్ కా”… అనే సీరియల్ వచ్చింది. ఈ సీరియల్ కూడా అందర్నీ ఆకట్టుకుంది.

అయితే ఈ సీరియల్ లో అవికా గోర్, మ‌నీశ్‌ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి అందరూ వీరిద్దరూ లవ్ లో ఉన్నారని అనుకున్నారు. అంతేకాదు మనిష్ తో కలిసి అవికా.. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై మనీష్ క్లారిటీ ఇచ్చాడు. అవికా గోర్ తనకు మంచి స్నేహితురాలని… తమ మధ్య స్నేహం తప్ప మరి ఇలాంటి ఫీలింగ్స్ లేవని స్పష్టం చేశాడు. అంతేకాదు అవికా తనకంటే.. వయసులో చాలా చిన్నదని పేర్కొన్నాడు.

అవికా గోర్ ప్రస్తుతం మిలింద్ చంద్వాణీతో డేటింగ్ లో కూడా ఉందని.. వాళ్ళు ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నారని చెప్పాడు. అంతేకాదు తనకు కిందటి సంవత్సరమే పెళ్లి జరిగిందని.. ఇలాంటి వార్తలు చూసి తన భార్య నవ్వుకుంటుంది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మ‌నీశ్‌రాయ్ సింగ‌న్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version