‘శాకుంతలం’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

-

యశోద వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నటించిన చిత్రం శాకుంతలం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ మూవీలో సమంత నటనకు మాత్రం మంచి మార్కులే ప్డాయి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత టైటిల్ రోల్​ను పోషించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్​గా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

మంచి అంచనాల నడుమ సుమారు 60‍కోట్లతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ అందుకోలేకపోయింది. విడుదలైన తొలిరోజు నుంచే నెగిటివ్‌ టాక్‌ రావడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ఇప్పుడీ సినిమా ప్రముఖ ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతోంది. ఈనెల 12న శాకుంతలం సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషాల్లో స్ట్రీమింగ్ కానుందట.

Read more RELATED
Recommended to you

Latest news