బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్.. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓవైపు తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటూనే.. మరోవైపు తన పిల్లల కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఇటీవలే షారుక్ కూతురు సుహానా నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న ది ఆర్చీస్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇక కుమారుడు ఆర్యన్ ఖాన్.. ఇటీవలే ఓ ఫ్యాషన్ బ్రాండ్ షురూ చేశాడు. అంతే కాకుండా ఓ యాడ్‌ను డైరెక్ట్ చేశాడు. ఆర్యన్ తన ఫోకస్ అంతా స్క్రిప్ట్ రైటింగ్.. డైరెక్షన్‌పై పెట్టాడు.
అయితే తాజాగా షారుక్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి మొదటిసారి ఓ చిత్రం కోసం కలిసి పనిచేయబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, షారుక్ కలయికలో మరో సినిమా రానుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. స్క్రిప్ట్ డిమాండ్ కారణంగా ఇందులో షారుక్, సుహానా కలిసి నటించబోతున్నారట. ‘ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.