షారుక్ కు లోకేష్ కనగరాజ్ ఆఫర్.. నో చెప్పిన బాలీవుడ్ బాద్ షా

-

యాక్షన్లో ఎమోషన్ యాడ్ చేసి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించడంలో సిద్ధహస్థుడు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ డైరెక్టర్ ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీ కాంత్తో తలైవా171 తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ను కూడా లైన్లో పెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం కాస్త ఫెయిల్ అయినట్లు ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తోంది.

రజినీ కాంత్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాలని షారక్ను సంప్రదించగా ఆయన నో చెప్పినట్లు సమాచారం. ఇటీవల తాను చాలా చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేశానని.. ప్రస్తుతం ఫుల్ లెంగ్త్ సినిమాలపైనే తన ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు బాద్ షా చెప్పినట్లు సమాచారం. అయితే షారుక్ నో చెప్పడంతో ఆ పాత్రకు రణ్వీర్ సింగ్ను సంప్రదించినట్లు సమాచారం. రణ్వీర్ ఈ పాత్ర చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని టాక్. కానీ దీని గురించి మూవీ టీమ్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. మొత్తానికి తలైవా సినిమాలో బాలీవుడ్ స్టార్ను తీసుకురావాలని లోకేశ్ తెగ ప్రయత్నిస్తున్నాడట. మరి ఈ ప్రయత్నం ఫలించేనా?

Read more RELATED
Recommended to you

Latest news