టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. డ్యూయల్ రోల్ లో నాగార్జున నటించగా రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించ్న ఈ సినిమా కంలీట్ విలేజ్ బ్యాగ్డ్రాప్ లో రూపొందించారు. ఇక ఈ సినిమాలో నాగార్జున బంగార్రాజు పాత్రలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. చెప్పాలంటే ఈ సినిమా తర్వాత నాగార్జున కి మళ్ళీ ఆ స్థాయిలో సక్సస్ దక్కలేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్ని ఫ్లాప్స్ గా మిగిలాయి. అయితే ఈ సినిమాకి అప్పుడే ప్రీక్వెల్ ని తీయాలని అనుకున్నారు. దాంతో బంగార్రాజు టైటిల్ ని రిజస్టర్ చేపించి ఆ పాత్ర చుట్టు కథ అల్లాడు కళ్యాణ్ కృష్ణ.
అయితే నాగార్జున కి వరుసగా సినిమాలు ఉండటం దానికి తోడు కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథ నాగార్జునకి నచ్చకపోవడం తో పక్కన పెట్టారు. అయితే ఈ కథ ని మళ్ళీ సిద్దం చేస్తూనే మాస్ మహారాజా రవితేజ తో నేల టికెట్ అన్న సినిమాని చేశాడు. కాని సినిమా డిజాస్టర్ అయింది. ఆ దెబ్బతో బిక్కు బిక్కు మంటున్న కళ్యాణ్ కృష్ణ ని పిలిచి మళ్ళీ బంగార్రాజు పట్టాలెక్కిద్దామని ఆఫర్ ఇచ్చాడు నాగార్జున. అయితే ఈ సారి కళ్యాణ్ కృష్ణ కి రెమ్యూనరేషన్ లేకుండా సినిమా హిట్టయితే లాభాల్లో వాటా ఇస్తానని మాటిచ్చారు. అందుకు ఓకే చెప్పే కళ్యాణ్ కృష్ణ నాగార్జున ని కథ తో మెప్పించాడు. ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక హీరోగా నటించనున్నాడని అన్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న’లవ్ స్టోరీ’ కంప్లీట్ కాగానే చైతూ తండ్రి నాగార్జున తో కలిసి బంగార్రాజు లో జాయిన్ అవుతాడని అన్నారు.
అయితే ప్రస్తుతం పరిస్థితులని బట్టి చూస్తుంటే అసలు ఈ ఏడాది బంగార్రాజు సెట్స్ మీదకి వెళడం కష్టమే అని తెలుస్తుంది. ఎందుకంటే అటు నాగా చైతన్య కమిటయిన సినిమా కంప్లీట్ చేయాలి. అలాగే నాగార్జున ఒక సినిమా కమిటయ్యారు. ఆ సినిమా కూడా కంప్లీటవ్వాలి. అప్పుడే ఇద్దరు కలిసి బంగార్రాజు సెట్ లో అడుగుపెడతారు. కానీ ఇప్పటికే కరోనా కారణం గా సినిమాలు రిలీజ్ డేట్లు పోస్ట్ పోన్ చేసుకొని ఉన్నాయి. అవన్ని నెమ్మదిగా ట్రాక్ లోకి వచ్చి రిలీజ్ అయ్యోసరికే ఈ సంవత్సరం గడిచిపోతుంది. కాబట్టి బంగార్రాజు సెట్స్ మీదకి వచ్చినా రిలీజ్ మాత్రం ఇప్పటికే క్యూ లో ఉన్న సినిమాల తర్వాతే ఉంటుందని తెలుస్తుంది.