100 కోట్ల క్లబ్ లో జీరో.. బట్ అన్ హ్యాపీ..!

-

షారుఖ్ ఖాన్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కలిసి నటించిన క్రేజీ మూవీ జీరో. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక వెనుకపడి ఉన్న షారుఖ్ నటించి నిర్మించిన ఈ సినిమా ఎన్నో భారీ అంచనాలతో వచ్చింది. ఆనంద్ ఎల్ రాయ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాని షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించడం జరిగింది. ట్రైలర్ తో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా లాస్ట్ ఫ్రై డే రిలీజైంది.

మొదటి షో నుండి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా యావరేజ్ టాక్ తో రన్ అవుతుంది. ఇక ఈ సినిమా మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ డే 20.14 కోట్లు, రెండో రోజు 18.22 కోట్లు, మూడవ రోజు 20.17 కోట్లు వసూళు చేసింది. ఓవర్సీస్ లో జీరో 3 డేస్ లో 35 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి వారాంతరంలో జీరో 110.60 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంతే 60 కోట్ల దాకా షేర్ ఉంటుందన్నమాట.

సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగులో స్టార్ సినిమాలే మొదటి రెండు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధిస్తున్న ఈ టైంలో షారుఖ్ జీరో 3డేస్ లో 100 కోట్లు దాటం పెద్ద విశేషం ఏమి కాదు. కాని షారుఖ్ వరుస ఫెయిల్యూర్స్ తో పోల్చుకుంటే ఈ జీరో సినిమా కాస్త బెటర్ అని చెప్పొచ్చు. క్రిస్ మస్ సందర్భంగా హాలీడేస్ ఉన్నాయి కాబట్టి కలక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news