వివాదంపై జీవిత క్లారిటీ..రాజ‘శేఖర్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్నారు. ‘PSV గరుడవేగ’ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత రాజశేఖర్ తను నటించే సినిమాల్లో క్రియేటివిటీ ప్లస్ వైవిధ్యం ఉండాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన‘శేఖర్’ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ పిక్చర్ కు రాజశేఖర్ భార్య జీవిత దర్శకత్వం వహించారు. మాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘జోసెఫ్’కు అఫీషియల్ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. వచ్చే నెల 20న సినిమా విడుదల కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని కీలక పాత్ర పోషించింది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కాగా, బీర‌మ్ సుధాక‌ర్ రెడ్డి ప్రొడ్యూసర్.

అలా ఓ వైపు ‘శేఖర్’ ఫిల్మ్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ మేకర్స్ ఇస్తుండగా, మరో వైపున జీవిత రాజశేఖర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. దీనిపై జీవిత క్లారిటీ ఇచ్చింది. ‘పీఎస్ వీ గరుడ వేగ’ సినిమా విషయమై జీవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆరోపిస్తు్న్నారు. అయితే, తాము ఎలాంటి తప్పు చేయలేదని, కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ చెప్తున్నారు. అలా వివాదాల నడుమ ‘శేఖర్’ చిత్ర విడుదల తేదీ ప్రకటించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version