టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి కారణంగా… ఆయన కుటుంబం ఇండస్ట్రీని ఏలుతోంది. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఊహించని పరిణామం ఎదురైంది. మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు.. హటాస్మాత్తుగా మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు. లంగ్స్ డ్యామేజ్ అవ్వడంతో హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో శిరీష్ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజను వివాహం చేసుకున్నాడు శిరీష్ భరద్వాజ్. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల శిరీష్, శ్రీజ విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల అనంతరం మరో పెళ్లి చేసుకున్నాడు శ్రీజ మాజీ భర్త శిరీష్. అయితే లేటెస్ట్ గా శిరీష్… తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.