ఆదిపురుష్ నుంచి ‘శివోహం’ వీడియో సాంగ్ రిలీజ్

-

ఆదిపురుష్ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి వివాదాలు.. ట్రోలింగే. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ ట్రోలింగ్ బాధ తప్పలేదు. ఎంత నెగిటివిటీని ఎదుర్కొన్నా ఈ సినిమాను ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రేమించారు. ఆ ప్రేమకు ప్రతిరూపమే ఆదిపురుష్ బాక్సాఫీస్ కలెక్షన్లు. ఈ సినిమా స్టోరీ సంగతి ఎలా ఉన్నా.. యాక్టింగ్ గురించి పక్కన బెడితే.. ఈ మూవీలో పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. అజయ్ అతుల్ తమ సంగీతంలో ఈ చిత్రానికి ప్రాణం పోశారని చెప్పొచ్చు. ఒక్కో పాట ఆణిముత్యం. ఇక ఈ సినిమాలోని శివోహం పాట థియేటర్‌లో గూస్‌బంప్స్‌ తెప్పించింది.

రావణుడిగా సైఫ్ అలీఖాన్‌ శివలింగం ముందు కూర్చొని వీణ వాయిస్తుంటే వేరే లెవల్‌ అనిపించింది. అజయ్‌-అతుల్ స్వర పరిచిన ఈ పాటను హరిచరణ్ ఆలపించాడు. ఇక తాజాగా శివోహం సాంగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్​లో ట్రెండింగ్​లో ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news