నాగచైతన్యతో హీరోయిన్ డేటింగ్.. క్లారిటీ

-

శోభితా ధూలిపాల ఈ తెలుగందం తెలుగులో కంటే ఎక్కువ ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది. పదహారణాల తెలుగు అందం.. అయినా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. ఇలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలన్నింటిలో తన సత్తా చాటుతోంది.

ఆమే తెలుగు చిన్నది.. శోభిత ధూలిపాళ. ఈ బ్యూటీ గూఢచారి సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైంది. అచ్చమైన ఈ తెలుగందం ఆ తర్వాత అడవి శేష్ నటించి మేజర్​లో కనిపించింది. ఇక వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన హవా కొనసాగిస్తోంది. అటు బాలీవుడ్​లోనూ ఈ బ్యూటీ తన సత్తా చాటుతోంది.

 

అయితే, నాగచైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై హీరోయిన్ శోభిత దూళిపాల స్పందించారు. ‘ఆ రూమర్ తో నాకు అసలు సంబంధమే లేదు. నేను ఏ తప్పు చేయనప్పుడు అర్జెంటుగా మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చేయాలని ఎందుకు అనిపిస్తుంది? తప్పు చేయనప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. నా పని నేను చూసుకుంటూ పోతాను’ అని స్పష్టం చేశారు. డేటింగ్ వార్తలను ఇదివరకే చైతు ఖండించారు.

Read more RELATED
Recommended to you

Latest news