షాక్: హీరోయిన్ పూర్ణ పెళ్లి క్యాన్సిల్.. అంటూ ప్రచారం.. కారణం..?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత వెండితెర పైన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నది హీరోయిన్ పూర్ణ.. ఇక హీరోయిన్ గా సీమ టపాకాయ్, అవును, దృశ్యం -2 సినిమాలలో నటించింది. అంతే కాకుండా పలు సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉంటోంది. ఇక పూర్ణ అందచందాలతో ఎప్పుడూ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక బుల్లితెరపై ఢీ వంటి షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇక అక్కడ కూడా బాగా పాపులారిటీ సంపాదించింది. ఈ పాపులారిటీతోనే మరింత క్రేజ్ ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

కెరియర్ పరంగా బిజీగా ఉంటున్న సమయంలో పూర్ణ వివాహం చేసుకోబోతున్నాను అని చెప్పి ఒక్కసారి గా అందరికీ షాక్ ఇచ్చింది. అది కూడా ఒక వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీ ను త్వరలో వివాహం చేసుకోబోతున్నానని తెలిపి అందుకు సంబంధించి ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరొక షాకింగ్ విషయం నెట్టింట వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే హీరోయిన్ పూర్ణ వివాహం క్యాన్సిల్ అయింది అనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నది.

ఇక తన చేసుకోబోయే భర్త సినిమాలలో నటించే అవకాశం కల్పించినా కూడా ఈమె తన వివాహాన్ని క్యాన్సిల్ చేసుకోబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం మాత్రం ఒక ప్రముఖ డైరెక్టర్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ డైరెక్టర్ ని వివాహం చేసుకోబోతోంది అన్నట్లుగా సమాచారం. ఆ కారణంగానే ఆసిఫ్ తో తన నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకుని ఆ డైరెక్టర్ తో వివాహానికి సిద్ధమైందని వార్తలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ వార్తలలో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే ఈ విషయంపై పూర్ణా నే స్పందించాలి. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version