Big Breaking యంగ్ ఇండియా కార్యాల‌యాన్ని సీజ్‌ చేసిన ఈడీ

-

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, సోనియా గాంధీలను విచారించిన ఈడీ.. ఈ కేసులో ఈడీ అధికారులు బుధ‌వారం ఓ కీల‌క అడుగు వేశారు. ఢిల్లీలోని నేష‌న‌ల్ హెరాల్డ్ కార్యాల‌యాల‌తో పాటు కోల్‌క‌తాలోని ఆ ప‌త్రిక కార్యాల‌యాల్లో మంగ‌ళ‌వారం నుంచి సోదాలు చేసిన ఈడీ… బుధ‌వారం సోదాల‌ను ముగించిన‌ట్లు తెలిపింది. అదే స‌మ‌యంలో ఢిల్లీలోని నేష‌న‌ల్ హెరాల్డ్ ప్ర‌ధాన కార్యాల‌యంలోనే న‌డుస్తున్న యంగ్ ఇండియా కార్యాల‌యాన్ని సీజ్ చేశారు ఈడీ అధికారులు.

ఈడీ తీసుకున్న ఈ చ‌ర్య‌తో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం (ఏఐసీసీ) ప‌రిస‌రాల్లో భారీగా పోలీసులు మోహ‌రించారు. ఫ‌లితంగా ఏఐసీసీ కార్యాల‌యానికి వెళ్లే దారుల‌న్నీ మూసుకుపోయాయి. అదే స‌మ‌యంలో యంగ్ ఇండియా ప్ర‌మోట‌ర్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నివాసం వ‌ద్ద కూడా పెద్ద సంఖ్య‌లో పోలీసు బ‌ల‌గాలు మోహ‌రించాయి. వెర‌సి ఢిల్లీలో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version