వర్మ దిశ సినిమా ఆపేయండి : హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి

-

దిశా సినిమాపై హైకోర్టును దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ఆశ్రయించారు. గత ఏడాది జరిగిన దిశా ఘటన ఆధారంగా దిశ పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనను ఆధారంగా చేసుకొని సినిమా తీయద్దని ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టులో దిశ తండ్రి పిటిషన్ దాఖలు చేసారు. ఈ సినిమా పై కేంద్ర ప్రభుత్వం స్పందించి సెన్సార్ బోర్డ్ పై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేయగా ఈ పిటిషన్ పై అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ స్పందించారు. ఈ సినిమా మీద పిటిషనర్ సెన్సార్ బోర్డుకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

త్వరితగతిన పిటిషనర్ అభ్యర్థనను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది. మా కూతురు చనిపోయి మా కుటుంబాన్ని తీవ్ర దుఖంలో ముంచేసిందని, ఆ సంఘటనను మరువలేక పోతున్నామని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో దిశ ఎన్ కౌంటర్ పేరుతో రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడని అన్నారు. అది కూడా తన కూతురు దూరం అయిన నవంబర్ 26నే సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడని అన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ట్రైలర్ రిలీజ్ చేశాడని, ఈ ట్రైలర్ కింద చాలా మంది అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని అన్నారు. ఒక వైపు కూతురు కోల్పోయిన బాధలో మేము ఉంటే, మరోవైపు ఈ కామెంట్లు, ట్రైలర్ మమ్మల్ని తీవ్రంగా కలిచి వేస్తోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news