Show Time Review: అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెసెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ గారికి పార్టీ నిర్మాతగా మదన దక్షిణామూర్తి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ షో టైం. ఈ సినిమాలో హీరోగా నవీన్ చంద్ర చేయగా హీరోయిన్గా కామాక్షి భాస్కర్ల నటించారు. ఈ సినిమా శుక్రవారం అంటే ఇవ్వాలా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంటుంది. మరి అలాంటి షో టైం సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దామా.

కథ మరియు విశ్లేషణ
నవీన్ చంద్ర హీరోగా చేసిన షో టైం సినిమా విషయాల్లోకి వెళితే.. కథ చెప్పుకోవడానికి ఒక సింపుల్ లైన్ మాత్రమే. ఓ ఇంటిలో అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఫ్యామిలీ మొత్తం కూర్చొని సరదాగా… ముచ్చటించుకుంటుండగా అర్ధరాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని సీఐ లక్ష్మీకాంత్ వార్నింగ్ ఇస్తాడు. అక్కడే హీరో నవీన్ చంద్ర అలాగే హీరోయిన్ శాంతి, సీఐ మధ్య గొడవ జరుగుతుంది. అయితే సిఐ లక్ష్మీకాంత్ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడే టైంలో కథ కీలక మలువు తిరుగుతుంది. అనంతరం కేసు నమోదు కావడం జరుగుతుంది. ఈ తరుణంలో వారిని లాయర్ వరదరాజులు ఎలా సేవ్ చేస్తాడనేది సినిమా.
ఇక ఈ షో టైమ్ సినిమాను సింపుల్ గా నీట్ గా తెరకెక్కించారు దర్శకుడు మదన్. ఫస్ట్ ఆఫ్ కేవలం 45 నిమిషాల నిడివితో ముగించి అసలు కథను సెకండ్ హాఫ్ లో పెట్టారు. ఎప్పుడైతే కథలు నరేష్ ఎంటర్ అవుతారో.. అక్కడి నుంచి కామెడీ మొదలవుతుంది. కడుపుబ్బ జనాలు నవ్వడమే కాక… సస్పెన్స్ కూడా ఫేస్ చేస్తారు. కామెడీ తో పాటు మంచి డైలాగులు ఈ సినిమాలో పెట్టారు. గవిరెడ్డి శ్రీనివాస్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ ఊహించని దానికంటే భిన్నంగా ఉంటుంది.
ఇక హీరో నవీన్ చంద్ర విషయానికి వస్తే ఈ సినిమాలో తన నటనను పండించాడు. వీకే నరేష్ తనదైన మార్కు కామెడీతో అదరగొట్టాడు. రాజా రవీంద్ర సైకో పోలీస్ పాత్రతో సినిమాను నడిపించాడు.
ఓవరాల్ : హీలియస్ గా నవ్విస్తూ… భయపెట్టే షో టైం చాలా అద్భుతంగా ఉంది.
రేటింగ్: 3/5