అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత సాధించని రైతుల కోసం అర్జీకి అవకాశం కల్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలియజేశారు. రైతు సేవా కేంద్రంలో అర్జీ ఇస్తే పోర్టల్ లో నమోదు చేస్తారు. ఇప్పటికే అర్హత సాధించిన రైతుల వివరాలను పోర్టల్ లో ఉంచారు. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి రైతులు వారు అర్హులో కాదో అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అనర్హులు అయిన వారు 155251 నంబర్ కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు.

కాగా, జూలై 10వ తేదీన ప్రధాని నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో అర్హులు అయిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని అమలులోకి తీసుకురాబోతున్నారు. ఏపీ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంతో ఏపీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.