బాల‌య్య ప్రేమ క‌థ‌.. ఆ ఇద్ద‌రి వ‌ల్లే త‌న ప్రేమ‌ను వ‌దులుకున్నాడ‌ట‌.. ఆమె కూడా స్టార్ హీరోయినే

జీవితంలో ప్రేమ‌లో ప‌డ‌ని వారంటూ ఉండ‌రు. అందుకు ఎవ్వ‌రూ అతీతులు కారు. ఎప్పుడో ఒకప్పుడు ఎవ‌రినో ఒక‌రిని ఇష్ట‌ప‌డే ఉంటారు. అలాగే నంద‌మూరి బాల‌కృష్ణకు కూడా ఒక ప్రేమ క‌థ ఉంద‌ట‌. త‌ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోలేక‌పోయాడ‌ట‌. ఈ విష‌యం బాల‌య్య కాస్ట్యూమ్ డిజైన‌ర్ బిగ్‌బాస్ కంటెస్టంట్ శ్రీరాపాక ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. బాల‌య్య పైకి గంభీరంగా క‌నిపిస్తారు కానీ ఆయ‌న మనసు వెన్నపూస. ఆయన స్నేహమైనా, ప్రేమ అయినా మనస్పూర్తిగా స్వచ్ఛంగా అందిస్తారంటూ చెప్పుకొచ్చింది. బాలకృష్ణ నమ్మితే ప్రాణం ఇస్తారు.

బాలయ్య ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించారు. ఆమెతోనే తన జీవితం పంచుకోవాలని కోరుకున్నారట. అయితే తండ్రి నందమూరి రామారావు మరియు అన్నయ్య హరికృష్ణ కు తెలియడం తో విషయం రివర్స్ అయ్యిందట. విష‌యం తెలిసింది ప్రేమ‌, దోమా అంటూ తిరుగుతున్నావా..?? ఇక్క‌డితో అంతా ఆపేయాలంటూ ఆగ్ర‌హించార‌ట‌. దాంతో బాల‌య్య త‌న ప్రేమ‌ను వ‌దులుకున్నార‌ట‌.

బాల‌య్య ప్రేమించిన అమ్మాయి కూడా ఇండస్ట్రీకి చెందిన వ్య‌క్తే.. అప్ప‌టికే సినిమాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుని ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలలో నటించారట‌. ఆ హీరోయిన్ పేరును మాత్రం శ్రీరాపాక చెప్ప‌లేదు. త‌రువాత బాల‌య్య కొన్నాళ్ళు సినిమాలకు కూడా దూరం అయ్యారట. అయితే బాలకృష్ణ తన కెరియర్ కి త‌ను ప్రేమించిన హీరోయిన్‌ తో ఒక్క సినిమా కూడా చేయలేదు.

ఒక్క సినిమాలో కూడా నటించ‌క‌పోయినా సినీ ప్ర‌ముఖుల పార్టీల్లో త‌రుచూ క‌లుస్తూ ఉండ‌టం, మాట మాట క‌లిసి మ‌న‌సులు క‌లిశాయట‌. ఆ హీరోయిన్ మెగాస్టార్‌కు అక్క‌గా కూడా న‌టించింది. అప్పుడ‌ప్పుడూ పాత‌త‌రం స్టార్ హీరోలు అంద‌రూ క‌లిసి గెట్ టు గెద‌ర్ పార్టీలు చేసుకుంటుంటారు. ఆ పార్టీల‌కు కూడా ఆమె వ‌స్తుంది. కానీ బాల‌య్య మాత్రం దూరంగా ఉంటాడు. బాల‌య్య రాక‌పోవ‌డం బాధ‌గా ఉందంటూ ఆ హీరోయిన్ కామెంట్స్ కూడా చేసింది. ఇంత‌కీ ఎవ‌బ్బా..??