రేపు అమరావతి రాజధాని పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఒకట్రెండు రోజుల్లో బిడ్ల పరిశీలనతో పాటు కాంట్రాక్టర్లతో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్(ఎల్‌వోఏ) పూర్తి కానుంది. ఈ ప్రక్రియ పూర్తవగానే నెలాఖరు నాటికి పనులను ప్రారంభించనున్నారు. గత వైసీపీ హయాంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించనుంది.
రేపు ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటకే అధికారులు పూర్తి చేశారు. ఈనెల 12 నుంచి పలు ప్రైవేట్ సంస్థలు తమ నిర్మాణాలను ప్రారంభించి రానున్న రోజుల్లో మరింత విస్తరించనున్నాయి.ఎస్‌ఆర్‌ఎంలో రూ.700 కోట్లతో కొత్త విభాగాల నిర్మాణం,విట్‌లో వసతి గృహాలు, అకాడమిక్ భవనాల నిర్మాణం, 4 కొత్త భవనాల కోసం అమృత్ వర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది.