బాలకృష్ణ బోయపాటి సినిమాలో శ్రియా శరణ్, అంజలి..?

-

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. ఇటీవల ఈ సినిమా నుండి బీబీ3 ఫస్ట్ రోర్ పేరుతో వచ్చిన టీజర్ బాలయ్య స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది. 10 మిలియన్ల యూట్యుబ్ వ్యూస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇక ఈ సినిమా బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకి మోనార్క్ అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నారు చిత్ర బృందం.

 

ఇక ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని ముందు నుంచి ప్రచారం అవుతుంది. కాని ఆ ఇద్దరు ఎవరన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ రోర్ సమయంలో హీరోయిన్స్ ని రివీల్ చేస్తారని నందమూరి అభిమానులు ఊహించారు. కాని అప్పుడు కూడా హీరోయిన్స్ ప్రస్తావన రాలేదు.

 

అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య సరసన శ్రియా శరణ్, అంజలి నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరు అయితే బాలయ్య సరసన పర్‌ఫెక్ట్ గా ఉంటుందన్న ఉద్దేశ్యంతో బోయపాటి శ్రీను సెలెక్ట్ చేశారని అంటున్నారు. త్వరలో అధికారకంగా వెల్లడిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని సాంగ్స్ కంపోజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఫస్ట్ రోర్ కి థమన్ ఇచ్చిన బ్యాగ్రౌడ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version