శ్రియ పెళ్లి తరువాత కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా వుంది. కరోనా సమయంలో భర్తతో కలిసి బార్సీలోనాలో వున్న ఇంటికే పరిమితమైన శ్రయ తాజాగా సినిమాల విషయంలో స్పీడు పెంచేసింది. ఆమె నటిస్తున్న `గమనం` తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ బాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతోంది.
ఇదిలా వుంటే శ్రియకు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` టీమ్ షాకిచ్చినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. శ్రియ అనూహ్యంగా `ఆర్ఆర్ఆర్`లో నటించే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. `ఛత్రపతి` తరువాత మరోసారి రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసిన శ్రియ ఇందులో అతిథి పాత్రలో మెరవబోతోంది. బాలీవుడ్ హీరో అజయ్‌దేవ్‌గన్‌కి జోడీగా శ్రియ కనిపించబోతోంది. అయితే ఆమె క్రేజీ హీరోయిన్ అయినా శ్రియకు మాత్రం ఇందులో ఒక్క పాట కూడా లేదని తెలిసింది. దీంతో అవాక్కయిన ఆమె ఫ్యాన్స్ `ఆర్ఆర్ఆర్` టీమ్ శ్రియకు షాకిచ్చిందని వాపోతున్నారట.