గ్లామర్ డాల్ శ్రియా శరణ్.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్. తన ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్ గురించి విషయాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తన భర్త ఆండీ.. కూతురు రాధతో సరదాగా గడిపిన క్షణాలకు సంబంధించి పోస్టులు పెడుతూ అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ అడవిలో తన కూతురు రాధతో కలిసి సందడి చేసింది. చిన్నపిల్లలా కుమార్తెతో ఆడుతూ ఎంజాయ్ చేసింది. అటవీ ప్రాంతంలో చెట్ల మధ్య శ్రియ కూతురు రాధతో కలిసి సరదాగా ఆడుకుంటున్న వీడియోను శ్రియ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇటీవలే మ్యూజిక్ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది శ్రియా. హై బడ్జెట్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఉపేంద్ర, సుదీప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కబ్జాలో సందడి చేసింది. ఈ బ్యూటీ త్వరలోనే హిందీలో దృశ్యం ప్రాంచైజీ, ప్రాజెక్ట్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ షూటింగ్‌లో పాల్గొనబోతోంది.
— shriya Saran die hard fan (@TamannaBhatiya2) June 23, 2023