నాకింకా పెళ్లి కాలేదంటే వినరేంట్రా బాబు.. మ్యారేజ్ రూమర్స్ పై శ్రుతి హాసన్ క్లారిటీ

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ పెళ్లికి సంబంధించిన విషయం మరోసారి నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ బ్యూటీకి పెళ్లయిందంటూ కొన్నాళ్లుగా పలు వెబ్సైట్లలో కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఓర్హాన్ అవత్రమణి (ఓరీ), శ్రుతి హాసన్కు పెళ్లైందని ఓ ఇంటర్వ్యూలో హింట్‌ ఇచ్చాడని ఈ కథనాలు పేర్కొన్నాయి.

ఈ విషయంపై శ్రుతి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం చెప్పింది.’ నాకు ఇంకా పెళ్లి కాలేదు. ప్రతీ చిన్న విషయాన్ని అందరితో షేర్ చేసుకునే నేను పెళ్లి విషయం ఎందుకు దాస్తాను? నాకైతే తెలీదు మరి. కామ్ డౌన్’ అంటూ ఇన్స్టాలో పోస్టు పెట్టారు. ‘ఇలాంటి వాటిపై మీరు ఎందుకు స్పందించడం’ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేసి శ్రుతికి మద్దతుగా నిలుస్తున్నారు. కొంతకాలంగా ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికాతో శ్రుతిహాసన్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట రీసెంట్గా దీపావళి పండుగ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంది. వీరి ఫొటోలు తరచూ నెట్టింట వైరల్ అవుతుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news