ఇటీవలే శృతిహాసన్ రెండేళ్ల ప్రేమకు గుడ్ బై చెప్పేసింది. రెండేళ్ల పాటు డీప్ లవ్ లో ఉన్న అమ్మడు విడిపోయిన తర్వాత ఏమి జరగట్లు అంతే ఫ్రీగా ఉంది. ప్రస్తుతం మళ్లీ సినిమాలతో బిజీ అవుతోంది. రెండేళ్ల గ్యాప్ ను ఏడాదిలో కవర్ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమాకు కమిట్ అయింది. తమిళ్, హీందీ భాషల్లోనూ కమిట్ మెంట్లు ఉన్నాయి. ఆమెరికాకు చెందిన అంతర్జాతీయ వెబ్ సిరీస్ టెడ్ స్టోన్ లో నటించే అరుదైన అవకాశం ఒడిసిపట్టుకుంది. అయితే తాజాగా అమ్మడు ట్విటర్లోకి వచ్చి అభిమానులను పకలరించింది. ఈ సందర్భంగా ఓ ఫ్యాన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారని ప్రశ్నించాడు.
మీ పెళ్లికి మేమంతా తప్పక రావాలి. ముఖ్యంగా మీ వీరాభిమానులంగా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నిన్ను ఆశీర్వదించాలని ఓ పోస్ట్ పెట్టాడు దీనికి శృతి స్పందింస్తూ పెళ్లి కోసం అయితే చాలా కాలం వెయిట్ చేయాలి. దానికి బధులుగా మనమంతా పుట్టిన రోజు వేడుకలుచే సుకుందాం. వస్తారా? అంటూ చిలిపి సమాధానం ఇచ్చింది. ఆ ట్వీట్ చూసి నేటి జనులు శృతిపై సెటైర్ల వర్షం గుపించారు. రెండేళ్లు ఒకరిని ప్రేమించి..ప్రేమలో బాధను కనీసం ఫీలవ్వలేదు. పైగా పెళ్లి అంటే పుట్టిన రోజు అంటూ వంకర సమాధానం చెప్పిందంటూ విమర్శించడం మొదలు పెట్టారు. అయితే వీటిపై మాత్రం అమ్మడు ఎలాంటి కామెంట్ చేయలేదు. మరి దీనిపై లేటు రియాక్షన్ ఏమైనా ఉంటుందేమో చూడాలి.
ఇక తండ్రి మొదలు పట్టిన శభాష్ నాయుడు కొంచెం షూటింగ్ పూర్తిచేసిన తర్వాత మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమా కావడంతో కమల్ హాసన్ కు తోడుగా మరో నిర్మాత ముందుకు రాలేదు. ఇందులో శృతి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు ఆమె దగ్గరుండి చూసుకునేది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ కు నిర్మాతను సెట్ చేసే బాధ్యతలు శృతి తీసుకుంటోందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం కమల్ వేరే సినిమాలతో పాటు, పొలిటికల్ గాను బిజీగా ఉండటంతోనే శృతి టేకప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.