అదితి రావ్ తో ఎఫైర్ పై హింట్ ఇచ్చిన సిద్ధార్థ్..!

-

గత కొన్ని రోజులుగా ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి, హీరో సిద్ధార్థ్ రిలేషన్ లో ఉన్నారన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. దీనిపై సిద్ధార్థ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు.. ఆయన ఒప్పుకున్నట్లు హింట్ ఇవ్వడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి తో సిద్ధార్థ రిలేషన్ లో ఉన్నాడని కొద్ది రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాదు వీరిద్దరూ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారని జనాలు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. ఆ పుకార్లను బలపరిచేలా వారి ప్రవర్తన కూడా కనిపించింది.

ఈ విషయంపై సిద్ధార్థ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇటీవల స్టార్ మా లో ప్రసారమవుతున్న ఒక డాన్స్ షోకి ముఖ్య అతిథిగా హాజరవగా.. యాంకర్ శ్రీముఖి ఒక ప్రశ్న అడిగింది.. మీరు జీవితాంతం కలిసి డాన్స్ చేయాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని అడగ్గా “మా ఊళ్లో అతిథిదేవోభవ” అంటారు అని సిద్ధార్థ్ సమాధానం తెలిపారు. అంటే అతిధి దేవోభవలో అతిధి అనే పేరు ఉంది కాబట్టి ఆయన పరోక్షంగా ఆమెతోనే జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నారు అన్నట్టుగా పరోక్షంగా హింట్ ఇచ్చారు.

అంతేకాదు అదితి రావు హైదరితో ఆయన లైఫ్ టైమ్ డాన్స్ పార్ట్నర్ గా ఉండాలనుకుంటున్నట్లు.. దాని అర్థం అదే అంటూ ఆమెతో ఆయన సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారని మరికొంతమంది వాదిస్తున్నారు. ఇకపోతే సిద్ధార్థ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version