బిచ్చగాడి డైరక్టర్ తో సిద్ధూ

-

బొమ్మరిల్లు సిద్ధార్థ్ గుర్తున్నాడు కదా అప్పట్లో లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించి తమిళ హీరో అయినా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు సిద్ధార్థ్. తనకు వచ్చిన క్రేజ్ ను సరిగా వాడుకోలేని సిద్ధూ లాస్ట్ ఇయర్ గృహం అనే దెయ్యాల కథతో వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమాకు సిద్ధార్థ్ నిర్మాతగా కూడా హిట్ అందుకున్నాడు.

ఇక ప్రస్తుతం సిద్ధార్థ్ మరోసారి తెలుగు, తమిళ, హింది భాషల్లో సినిమా చేస్తున్నాడు. బిచ్చగాడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శషి డైరక్షన్ లో సిద్ధార్థ్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుందట. సినిమాలో హీరో టర్నెడ్ మ్యూజిక్ డైరక్టర్ జివి ప్రకాశ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. బిచ్చగాడు సినిమా తర్వాత విజయ్ ఆంటోనీకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే సిద్ధార్థ్ తను కోల్పోయిన ఇమేజ్ ను తెచ్ చుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news