దుబాయి వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) – 2023 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. సైమా 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. అలాగే ‘ధమకా’లో నటనకు శ్రీలీల ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ చిత్రంగా సీతారామం ఎంపికయ్యాయి.
‘సైమా’ 2023 అవార్డుల విజేతలు వీళ్లే
- ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (ఆర్‌ఆర్‌ఆర్)
- ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
- ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్)
- ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్)
- ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్)
- ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
- ఉత్తమ విలన్: సుహాస్ (హిట్2)
- ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడవి శేష్ (మేజర్)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతారామం)
- ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్, అనురాగ్ (మేజర్)
- ఉత్తమ పరిచయ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
- ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్ (ఆర్‌ఆర్ఆర్)
- ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (నాటు నాటు)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (డీజే టిల్లు)
- ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)
- సెన్సేషన్‌ఆఫ్ ది ఇయర్ : నిఖిల్, కార్తికేయ2
- ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్
- ప్రామిసింగ్ న్యూకమర్ (తెలుగు): బెల్లంకొండ గణేష్