అత్తారింటికి తమిళ హీరో ఎవరంటే..!

-

త్రివిక్రం డైరక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సినిమా అతారింటికి దారేది రికార్డులకు కొత్త దారి చూపించింది. త్రివిక్రం, పవన్ కెరియర్ లలో బెస్ట్ హిట్ గా నిలిచిన ఆ సినిమా తర్వాత వారిద్దరి అజ్ఞాతవాసి సినిమా చేశారు. కాని ఆ సినిమా అంత ప్రేక్షకాదరణ పొందలేదు. ప్రస్తుతం త్రివిక్రం అరవింద సమేత సినిమా చేస్తున్నాడు.

అత్తారింటికి దారేది సినిమా తమిళం లో రీమేక్ అవబోతుందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న వార్త. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా తమిళ రైట్స్ కొనేసింది. తమిళంలో హీరోగా శింభు నటిస్తాడని తెలుస్తుంది. సుందర్ సి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారట. తెలుగులో హిట్ అయిన అత్తారింటికి దారేది సినిమా కన్నడలో ఆల్రెడీ రీమేక్ అయ్యింది. అక్కడ కిచ్చ సుదీప్ రీమేక్ చేయగా అక్కడ మంచి ఫలితాన్ని అందుకుంది.

ఇప్పుడు ఈ సినిమా తమిళ రీమేక్ కాబోతుంది. కొన్నాళ్లుగా అసలేమాత్రం ఫాం లో లేని శింభు ఈ సినిమాపై కన్నేశాడు. ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ కాబట్టి సినిమా కచ్చితంగా కోలీవుడ్ లో కూడా మంచి ఫలితాన్నే అందుకునే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version