త్రిష పెళ్లి ఆగిపోవడానికి కారణం పెళ్లి తరువాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తానని గట్టిగా చెప్పడమేనని, అది వరుణ్ మణియన్‌కి నచ్చకపోవడం వల్లే త్రిష అతనితో వివాహాన్ని రద్దు చేసుకుందిని తమిళనాట వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆ వార్తల్లో నిజం లేదని, త్రిష – వరుణ్ మణియన్‌ల వివాహం ఆగిపోవడానికి ప్రధాన కారణం హీరో శింబు అని ప్రచారం మొదలైంది. దీనిపై శింబు తండ్రి రాజేందర్ మాట్లాడేందుకు నిరాకరించారు.
తాజాగా అంటే ఈ నెల 22న శింబు సోషల్ మీడియాలోకి ఎంటర్ కాబోతున్నారట. ఇంత వరకు ఆయనకు ట్విట్టర్‌లో అకౌంట్‌లేదు. ఈ నెల 22న ఎంటరవుతున్నారట. ఇదే రోజు తన పెళ్లి వార్తని కూడా శింబు అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా త్రిష, శింబు డేటింగ్ చేస్తున్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తమపై వస్తున్న రూమర్‌లకు పెళ్లి వార్తతో చెక్ పెట్టాలని శింబు భావిస్తున్నాడని తెలిసింది.