ప్రముఖ నిర్మాతపై కేసు పెట్టిన హీరో శివకార్తికేయన్ !

-

తమిళనాడు స్టార్ హీరో శివ కార్తికేయన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు తమిళ్ ఇటు తెలుగులోనూ తన స్టార్ డమ్ పెంచుకున్నాడు హీరో. అయితే తాజాగా హీరో శివ కార్తికేయన్ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చాడు. తాజాగా తన సినిమా పారితోషికం విషయంలో.. మద్రాస్ కోర్టును ఆశ్రయించాడు. నిర్మాత జ్ఞానవేల్ రాజా తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వలేదంటూ కోర్టుకెక్కాడు.

మూడు సంవత్సరాల కింద శివ కార్తికేయన్ హీరోగా మిస్టర్ లోకల్ అనే సినిమా చేశాడు జ్ఞానవేల్. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా రెమ్యూనరేషన్ తనకు పూర్తిగా ఇవ్వలేదంటూ మద్రాస్ కోర్టును తాజాగా శివకార్తికేయన్ ఆశ్రయించాడు.

సినిమా కమిట్ అయ్యే ముందు తనకు 15 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానని స్టూడియో గ్రీన్ అగ్రిమెంట్ కుదుర్చుకుందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే 11 కోట్లు ఇచ్చిన తర్వాత మిగిలిన నాలుగు కోట్లు ఇప్పటివరకు రాలేదని… తన డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాడు హీరో శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈ వివాదం తమిళనాడు చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. అయితే దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version