పాపం అనిల్ రావిపూడి …”ఎఫ్ 3″ ఉండదా ..?

-

టాలీవుడ్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సస్ ట్రాక్ అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు ఫ్లాప్ అన్నదే ఎరగడు. రాజమౌళి, కొరటాల శివ మాదిరిగా మంచి సక్సస్ ఫుల్ సినిమాలను తీస్తూ ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్నాడు. అంతేకాదు అతి కొద్ది కాలంలోనే స్టార్స్ ని డైరెక్ట్ చేసే అవకాశాలని వరసగా అందుకుంటున్నాడు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల‌తో తెరకెక్కించిన మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సంక్రాంతి రేస్ లో దిగిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే.

 

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడే సీక్వెల్ ని నిర్మించాలని దిల్ రాజు నిర్ణయించుకున్నారు. దర్శకుడు అనిల్ రావి పూడి చెప్పిన ఎఫ్ 3 కి లైన్ దిల్ రాజు కి విపరీతంగా నచ్చి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చెయమని గతంలోనే చెప్పారు. ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో దిల్ రాజు ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడికి ఎఫ్ 3 స్క్రిప్ట్ సిద్దం చేయమనగా ప్రస్తుతం అనిల్ రావిపూడి అదే పనిలో బిజీగా ఉన్నాడు.

ఇంకో రెండు వారాల్లో ఎఫ్ 3 స్క్రిప్ట్ పనులు కూడా పూర్తవుతాయట. ఇక ‘ఎఫ్ 2’ సీక్వెల్ లో మూడో హీరో ఉండరని అనిల్ రావిపూడి ఇటీవలే క్లారిటీ ఇచ్చాడు. ‘ఎఫ్ 2’ లో ఉన్న నటీనటులతో పాటు వారి పాత్రలు కూడా ‘ఎఫ్ 3’ లో కంటిన్యూ అవుతాయట. వెంకీ – వరుణ్ తేజ్ జీవితాలను ఆధారం చేసునే ‘ఎఫ్ 2’ తర్వాత ఏం జరిగిందో అదే ఎఫ్ 3 కథ అని క్లారిటి ఇచ్చాడు అనిల్ రావిపూడి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి లాక్ డౌన్ ఎత్తేసిన థియోటర్స్ ఓపెన్ అయినా ఆ తర్వాత ఉండే పరిణామాలను బట్టే ఎఫ్ 3 ఉంటుందని అంటున్నాడు. ఒకవేళ ఇప్పట్లో పరిస్థితులు చక్కబడకపోతే ఎఫ్ 3 ఉండకపోవచ్చు అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version