SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

-

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన సొంత ఖర్చులతో పంపించాడు. అలాగే ఉపాధి కోల్పోయిన కార్మికులకు కూడా తానే ఉపాధి కలిపిస్తున్నాడు. అదే విధంగా కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి కూడా సోనూసూద్ తన ఆపన్న హస్తాన్ని అందించారు. ఇప్పుడు సోనూ సూద్ ఏం చేసినా వెంటనే వైరల్ అవుతోంది. అయితే తాజాగా … సోనూసూద్ మరో కొత్త అవతారంలో కనిపించాడు. సైకిల్ పైనే సూపర్ మార్కెట్ ఓపెన్ చేశాడు సోనూసూద్. గుడ్లు మరియు బ్రెడ్ అమ్ముతూ దర్శనమిచ్చాడు.

సోనూసూద్

అంతేకాదు కావాలంటే ఫ్రీ డెలివరీ కూడా ఇస్తానని సోను సూద్ చెబుతున్నాడు. సోనూ సూద్ కోడిగుడ్లు అమ్మడం ఏంటి అనుకుంటున్నారా? అవును దీనికి సంబంధించిన ఓ వీడియోనూ తన ఇంస్టాగ్రామ్ లో సోనూసూద్ పోస్ట్ చేశాడు. సైకిల్ పై కూర్చొని తన సూపర్ మార్కెట్ ను సోనుసూద్ పరిచయం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. గుడ్లు మరియు బ్రెడ్ ఇతర వంట సరుకులు చూపిస్తూ… సేల్స్ మాన్ మాదిరిగా వాటి ధరలు కూడా వివరించాడు. 10 కోడిగుడ్లు కొనుగోలు చేసే ఒక బ్రెడ్ ఫ్రీ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు. అయితే సోనూసూద్ ఈ సైకిల్ పై సూపర్ మార్కెట్ ను ఎందుకు ఓపెన్ చేశారు అనే విషయం పై స్పష్టత రాలేదు. చిన్న వ్యాపారాలకు మద్దతు వచ్చేలా తన ఫాలోవర్లు ప్రోత్సహించడానికి సోను ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news