ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జగడం నడుస్తోంది. కృష్ణా నది నీళ్లపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జరిగిన కేబినెట్లో ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై కోర్టులో పోరాడాలని తీర్మాణం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్‌రెడ్డి మొన్న వివాదాస్పద కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
అందులో మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని దొంగ అని వ్యాఖ్యానించారు. అలాగే సీఎం జగన్‌ను గజదొంగ అని సంచలన కామెంట్లు చేశారు మంత్రి. అయితే ఇదే వివాదంపై వైసీపీ నేతలైనశ్రీకాంత్ రెడ్డి, రోజా, రవీంద్రనాథ్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
అయితే దీనిపై మంత్రి స్పందిస్తూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని తెలంగాణ ప్రత్యేక రాష్టర వ్యతిరేకిగా చెప్పారు. వందల మంది స్టూడెంట్ల చావులకు రాజశేఖర్‌రెడ్డే కారణమని, ఆయన తెలంగాణ పట్ల రాక్షసుడిగా వ్యవహరించారని మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు ప్రశాంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలతో ఏపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అయిన నారాయణ మాట్లాడుతూ మంత్రి నాలుకను కోసేయాలని సంచలన కామెంట్లు చేశారు. మరి దీనిపై మంత్రి ఏమైనా స్పందిస్తారో లేదో చూడాలి.