సాయం కోరిన ఒక వ్యక్తి.. నవ్వులు పూయిస్తున్న సోను సూద్ రిప్లై..!

కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఆపద్బాంధవుడు గా మారిపోయి సహాయం కావాలి అని కోరిన ప్రతి ఒకరికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు సోను సూద్. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో అయితే ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు. సహాయం కావాలని ఎవరు కోరిక తన స్థాయి మేరకు సహాయం చేస్తూనే ఉన్నాడు సోను సూద్. దేశంలో ఏ ప్రాంతం నుంచి సహాయం కోరిన సహాయం చెయ్యడానికి వెనకడుగు వేయడం లేదు. ఇప్పుడు వరకు ఎంతో మందికి సహాయం చేసిన విషయం తెలిసిందే

ఇక ఇటీవల సోను సూద్ ని వ్యక్తి వింత సాయం కోరాడు. తాను మాల్దీవులు టూర్ వెళ్లడానికి తనకు సహాయం చేయండి సోను సూద్ సార్ అంటూ సోషల్ మీడియా వేదికగా సోనూసూద్ ని ట్యాగ్ చేస్తూ ఒక వ్యక్తి పెట్టాడు. ఇక వెంటనే స్పందించిన సోను సూద్ సైకిల్ పై వెళ్తావా బైక్పై వెళ్తావా అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే కార్లో వెళ్తాను అంటూ సదరు నెటిజన్ రిప్లై ఇవ్వడం తో… నేనే వచ్చి స్వయంగా డ్రాప్ చేస్తాను అంటూ కామెంట్ చేశాడు సోను సూద్. దీంతో ఇది చూసిన నెటిజన్లు అందరూ నవ్వుకుంటున్నారు.