సౌత్ – నార్త్ : ఎందుకీ వివాదం ? ఏమిటీ గోల !

-

కన్నడ స్టార్ హీరో, విలన్ కిచ్చా సుదీప, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌ల మధ్య ఏర్పడిన ట్విటర్‌ వార్‌ గురించి తెలిసిందే..!ఈ వార్ లోకి కొందరు ప్రముఖులు కూడా ఎంట్రీ ఇచ్చారు. అందరూ వారిద్దరినీ కూల్ చేయాలని చూస్తే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం మరింత ఆజ్యం పోస్తూ బాలీవుడ్ పై సెటైర్లు వేశారు.దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో దీనిపై వరుసగా బాలీవుడ్‌, సౌత్‌ స్టార్స్‌ స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోనూసూద్‌, మనోజ్‌ బాజ్‌పాయి వంటి స్టార్లు స్పందించి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

తాజాగా ఈ వివాదం లోకి బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా ఎంట్రీ ఇచ్చారు.ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణాది సినిమాలు ‘పుష్మ: ద‌ రైజ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌ 2’లు బాలీవుడ్‌లో భారీ విజయం సాధించడంపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. నేను ఇప్పటివరకూ సౌత్, కమర్షియల్ సినిమాలను చూడలేదు..వాటి మీద పెద్దగా ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు.అందుకే వాటి గురించి నేను కామెంట్ చేయలేను అని అన్నారు.

అంతేకాదు హిందీ భాష పై వస్తున్న విమర్శల పై స్పందించిన ఆయన మాట్లాడుతూ..బాలీవుడ్ లో కరోనా తర్వాత పెద్దగా హిట్ సినిమాలు కనిపించలేదు. సినిమాలపై ప్రేక్షకుడి అభిరుచి మారిందని ఆయన అన్నారు. ‘ఒక సినిమా హిట్‌ అయితే అంతా కలిసి దాన్ని ఆకాశానికెత్తడం. అంతగా కలెక్షన్స్‌ రాకుంటే వెంటనే విమర్శలు చేయడం కామన్.. ఇప్పుడు ప్రేక్షకులకు, సినీ పెద్దలకు ఇది ఓ ఫ్యాషన్ అయ్యింది.బాలీవుడ్‌కు ఒక్క బ్లాక్‌బస్టర్‌ పడితే అంతా సర్దుకుంటుంది’ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version