కార్మికులకు లబ్ది చేకూరేలా ప్రత్యేక చట్టం తెస్తున్నాం : కిషన్‌ రెడ్డి

-

నేడు మేడే సందర్భంగా హైదరాబాద్‌లో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.జజ కరోనా సంక్షోభం వల్ల సినీ, పర్యాటక రంగాలు ఎంతో నష్టపోయాయని ఆయన అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చాక సినీ, పర్యాటక రంగాలు కాస్త నిలదొక్కుకున్నాయని వివరించారు కిషన్‌రెడ్డి. తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వెనుక కార్మికుల కృషి ఉందని కేంద్రమంత్రి కొనియాడారు.

దేశంలో 45 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారని వెల్లడించారు. 5 కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉన్నారని వెల్లడించారు. సంఘటిత రంగ కార్మికులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయని, అందుకే అసంఘటిత రంగ కార్మికులకు కూడా లబ్ది చేకూరేలా ప్రత్యేక చట్టం తెస్తున్నామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ-శ్రమ్ కార్డులు తీసుకుంటే కార్మికులకు ప్రయోజనాలు కలుగుతాయని, ఇప్పటికే 28 కోట్ల ఈ-శ్రమ్ కార్డులు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం 29 చట్టాలను 4 చట్టాలుగా మార్చామని, సోషల్ సెక్యూరిటీ బోర్డు చట్టం సినీ కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందని కిషన్‌రెడ్డి వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version