సైరా ‘ పై విష ప్ర‌చారం చేస్తోందెవ‌రు…

-

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వ‌ద్ద ఓ మోస్త‌రు వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. ఇక తెలుగు వెర్ష‌న్ వ‌ర‌కు ఈ సినిమాకు మంచి టాక్ ఉన్నా… మిగిలిన లాంగ్వేజెస్‌లో మంచి టాక్ లేదు. హిందీ, త‌మిళ్‌లో అయితే డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చేసింది. అస‌లు వాళ్లు ఈ సినిమాను ప‌ట్టించుకున్న‌ట్టు కూడా లేదు. ఇదిలా ఉంటే సైరా విడుదలైనప్పటి నుండి, కొంతమంది వ్యతిరేక అభిమానులు సైరాపై విషం చిమ్ముతున్నారు.

 

స‌డెన్‌గా వీళ్లంతా హృతిక్ రోషన్ మరియు గోపిచంద్ యొక్క హార్డ్ అభిమానులుగా మారారు మరియు వార్ మరియు చాణక్య చిత్రాలకు గొప్ప ప్రమోషన్లు చేస్తున్నారు. వార్ సినిమాకు భారీగా ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. ఇక గోపీచంద్ చాణ‌క్య కూడా సూప‌ర్బ్‌గా ఉంటుంద‌ని వాళ్లు చెపుతున్నారు. ముఖ్యంగా ఓ వ‌ర్గం మీడియాలో సైతం సైరా నిరాశ ప‌రిచింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో కావాల‌నే వీళ్లంతా సైరాను టార్గెట్గా చేసుకున్నార‌ని చిరు అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక ఎవ్వ‌రి ప్ర‌చారం ఎలా ?  ఉన్నా తెలుగు వెర్ష‌న్ వ‌ర‌కు సైరా పర్వాలేద‌నిపించే స్థాయిలో వ‌సూళ్లు రాబ‌డుతోంది. మ‌రి మిగిలిన భాష‌ల్లో మాత్రం భారీ న‌ష్టాలు మిగిల్చేలా క‌నిపిస్తోంది. మ‌రి ఈ ప‌రిస్థితుల్లో సైరాను టార్గెట్‌గా చేసుకుని జ‌రుగుతోన్న ప్ర‌చారం ఈ సినిమా ఎలా త‌ట్టుకుని ముందుకు వెళుతుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version