నా ఫస్ట్ లిప్‌లాక్ అతడితోనే : శ్రీలీల

-

టాలీవుడ్​లో ప్రజెంట్ హాప్పెనింగ్ అండ్​ మోస్ట్ వాంటెడ్​ హీరోయిన్.. శ్రీలీల. ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. దాదాపు డజను సినిమాలు ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఈ బ్యూటీ సినిమాలు వరుసగా రిలీజ్​కు రెడీగా ఉన్నాయి. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీలీల.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది.

ఏకంగా బాలకృష్ణ లాంటి అగ్రతారల సినిమాలో.. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే.. స్టార్ హీరోలతో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ శ్రీలీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏ హీరోతో లిప్ లాక్ సీన్ చేస్తారని ‘భగవంత్ కేసరి’ ప్రమోషన్లలో ఓ యాంకర్ శ్రీలీలను ప్రశ్నించారు. ‘నేను లిప్ లాక్ సీన్లలో అస్సలు నటించను. ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. అలా చేయాల్సివస్తే మాత్రం ఫస్ట్ లిప్ లాక్ కచ్చితంగా నా భర్తకే ఇస్తా’ అని శ్రీలీల తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news