ఈరోజుల్లో అనారోగ్య సమస్యలకు అందరూ ట్యాబ్లెట్స్నే వాడుతుంటారు. కొందరైతే రోజూ ఏదో ఒక మాత్ర వేసుకుంటారు.. షుగర్, బీపీ, గ్యాస్ ఈ సమస్యలు ఉన్నవాళ్లు అయితే రోజుకు ఒక్క ట్యాబ్లెట్ పక్కా వేసుకోవాల్సిందే.. అయితే ట్యాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ వేసుకునేటప్పుడు కచ్చితంగా నీటిని తాగుతారు. కొంతమందికి ట్యాబ్లెట్స్ వేసుకోవడం అంటే చచ్చేంత భయం.. చాలా కష్టంమీద.. గొంతు లోపలకి పెట్టి ట్యాబ్లెట్స్ వేసుకుని టకటకా వాటర్ తాగేస్తారు. అసలు ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఎంత వాటర్ తాగాలో మీకు తెలుసా..?
ట్యాబ్లెట్లను వేసుకునేటప్పుడు నీటిని తాగకపోతే ఆ ట్యాబ్లెట్లు నోట్లో లేదా గొంతులో.. ఎక్కడైనా అతుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశాలు కూడా లేకపోలేదు. నీళ్లను అసలు తాగకపోయినా.. తగినంత నీటిని తాగకపోయినా.. మనం వేసుకునే ట్యాబ్లెట్లు జీర్ణాశయంలో సరిగ్గా కరగవు. దీంతో ఆ ట్యాబ్లెట్ ద్వారా మనకు పూర్తి స్థాయిలో ఫలితం అందదు.. అందుకనే ట్యాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ ను వేసుకునేటప్పుడు కచ్చితంగా నీటిని తాగాలని డాక్టర్లు చెబుతుంటారు.
అయితే ట్యాబ్లెట్లను వేసుకునేటప్పుడు నీటిని ఎంత మోతాదులో తాగాలి ? అనే విషయం చాలా మందికి తెలియదు. అసలు దీనికి కూడా ఒక పరిమాణం ఉంటుంది ఎవరూ అనుకోని ఉండరు. కొందరు చాలా తక్కువ మొత్తంలో నీటిని తాగుతుంటారు. ఇలా తాగినా పెద్దగా ఫలితం ఉండదు. ట్యాబ్లెట్లు పూర్తిగా కరిగి వాటి ద్వారా ఎక్కువ మొత్తంలో ఫలితం పొందాలంటే.. ట్యాబ్లెట్లను వేసుకున్నాక.. ఒక గ్లాస్ నీటిని పూర్తిగా తాగేయాలి.
ఇక ట్యాబ్లెట్లు ఎన్ని ఉన్నా సరే ఒక గ్లాస్ నీటిని పూర్తిగా తాగితే చాలు. అలాగే మరీ చల్లగా.. మరీ వేడిగా ఉండే నీళ్లను అస్సలు తాగకూడదు..గది ఉష్ణోగ్రత వద్ద ఉండే నీళ్లనే తాగాలి. అప్పుడే ట్యాబ్లెట్ సులభంగా కరిగిపోతుంది. ఈ విధంగా ట్యాబ్లెట్లను లేదా క్యాప్సూల్స్‌ను వేసుకోవాలి. నీటిని మాత్రం ఒక గ్లాస్ పూర్తిగా తాగాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడే వారు ఈ విషయం తెలుసుకోని ఉండాలి..